O Naavikaa song lyrics :
ఓ నావికా.. ఓ నావికా..
ఓ నావికా.. యేసు సామి ఊసు వినవా..
ఓ నావికా…. ఓ నావికా….
శ్రమలలో శ్రామికా… ||2||
ఊసు వింటివా వింత గంటివా
యేసు సామి ఊసు నీవు వింటివా ||2||
హైలెస్సో హైలెస్సా
హైలెస్సో హైలెస్సా ||2||
వలేసావు రాతిరంతా
ధార పోసావు కష్టమంతా ||2||
చిక్కలేదు చేప ఒక్కటైనా
దక్కలేదు ఫలము కొంతైనా ||2||
అడుగడుగో యేసు వచ్చెనయ్యా
వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా ||2||
నింపాడు నీ నావ అద్భుత రీతితో
తృప్తిపరిచె నీ బ్రతుకు గొప్ప మేళ్ళతో ||2||
వెంబడించు యేసును పూర్ణ శక్తితో
యేసే ఈ జగతికి సర్వాధికారి
యేసే నీ నావకి చూపించు దారి ||2||
చేస్తాడు నిన్ను అసలైన జాలరి
మనుషుల పట్టే జాలరి ||2|| ||ఓ నావికా||
విరిగి నలిగిన మనస్సుతో
చేసావు నీ సమరం ||2||
శయనించక ఎడతెగక
ఈదావు ఈ భవ సాగరం ||2||
అడుగడుగో యేసు వచ్చెనయ్యా
వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా ||2||
కరుణించాడు నిన్ను చల్లని చూపుతో
నిర్మలమయ్యె బ్రతుకు యేసుని ప్రేమతో ||2||
వెంబడించు యేసును పూర్ణ శక్తితో
యేసే ఈ జగతికి సర్వాధికారి
యేసే నీ నావకి చూపించు దారి ||2||
చేస్తాడు నిన్ను అసలైన జాలరి
మనుషుల పట్టే జాలరి ||2|| ||ఓ నావికా||
For Video Song: O Naavikaa – ఓ నావికా
