Ninnu Vembadincheda song lyrics:
నిన్ను వెంబడించెద
నీ కాడి మోయుదున్
నీదు పాదముల చెంత
నే నేర్చుకొందును ||2||
మాదిరి నీవే – నెమ్మది నీవే
దీనుడవు యేసయ్యా ||2|| ||నిన్ను||
పాపాంధకారం లో నుండి
రక్షించి వెలిగించితివి ||2||
పరిశుద్ధమైన పిలుపుతో
నీ వెంబడి రమ్మంటివి ||2||
నీ వెంబడి రమ్మంటివి ||నిన్ను||
లోకాశలన్ని నీ కోసం
నేనింక ఆశించను ||2||
లోపంబులేని ప్రేమతో
నీ కోసం జీవింతును ||2||
నీ కోసం జీవింతును ||నిన్ను||
పవిత్రపరచుకొందును
అర్పించు కొందును ||2||
కష్టాలు శ్రమలు రేగినా
నిను వీడిపోనయ్యా ||2||
నిను వీడిపోనయ్యా ||నిన్ను||
ప్రేమ సువార్త ప్రకటింప
భారంబు మోపితివి ||2||
సత్యమార్గంబు చాటగ
పంపుము నా ప్రభువా ||2||
పంపుము నా ప్రభువా ||నిన్ను||