Nijamuga mora Pettina song lyrics:
నిజముగా మొర పెట్టిన
దేవుడాలకించకుండునా
సహనముతో కనిపెట్టిన
సమాధానమీయకుండునా
జీవముగల దేవుడు మౌనముగా ఉండునా
తన పిల్లలకాయన మేలు చేయకుండునా ||2|| ||నిజముగా||
పరలోక తండ్రినడిగిన
మంచి ఈవులీయకుండునా ||2||
కరములెత్తి ప్రార్థించినా
దీవెనలు కురియకుండునా ||2|| ||జీవముగల||
సృష్టి కర్త అయిన ప్రభువుకు
మన అక్కర తెలియకుండునా ||2||
సరి అయిన సమయానికి
దయచేయక ఊరకుండునా ||2|| ||జీవముగల||
సర్వశక్తుడైన ప్రభువుకు
సాధ్యము కానిదుండునా ||2||
తన మహిమ కనపరచుటకు
దయ చేయక ఊరకుండునా ||2|| ||జీవముగల||