Neeve Naa Rakshana song lyrics:
నీవే నా రక్షణ – నీవే నిరీక్షణ
నీవే నా దీవెన – నీవే క్షమాపణ ||2||
యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా
యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా ||2|| ||నీవే నా||
గతమును మన్నించి గుణవంతునిగా చేసి
నన్ను మలచి నన్నే మరిపించి ||2||
మనిషిగా మార్చినావు
నీ మనసు నాకిచ్చినావు ||2|| ||యేసయ్యా||
కన్నీరు తుడచి కష్టాలు తీర్చి
అండగ నిలిచి అడ్డులన్ని తొలగించి ||2||
మనిషిగా మార్చినావు
మాదిరిగ చేసినావు ||2|| ||యేసయ్యా||