Nee krupa lenicho song lyrics:
నీ కృప లేనిచో ఒక క్షణమైననూ
నే నిలువజాలనో ప్రభు ||2||
నీ కృప లేనిచో ఒక క్షణమైననూ
నే నిలువజాలనో ప్రభు ||2||
ప్రతి క్షణం కనుపాపలా
నను కాయుచున్న దేవుడా ||2|| ||నీ కృప||
ఈ ఊపిరి నీదేనయ్యా
నీవిచ్చిన దానం నాకై
నా ఆశ నీవేనయ్యా
నా జీవితమంతా నీకై ||2||
నిను నే మరతునా మరువనో ప్రభు
నిను నే విడతునా విడువనో ప్రభు ||2|| ||నీ కృప||
నా ఐశ్వర్యమంతా నీవే
ఉంచినావు నీ దయ నాపై
నీ దయ లేనిచో నాపై
ఉందునా ఈ క్షణమునకై ||2||
కాచి ఉంచినావయ్యా – ఇంత వరకును
నను వీడిపోదయ్యా – నాకున్న నీ కృప ||2|| ||నీ కృప||