Nee Krupa Leni Kshanamu song lyrics:
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా ||2||
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా ||2|| ||నీ కృప||
మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు ||2||
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప ||2|| ||యేసయ్యా||
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు ||2||
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప ||2|| ||యేసయ్యా||