Nee Krupa Lekunda Nenela song lyrics:
నీ కృప లేకుండా నేనేల జీవించగలను
నీ దయ లేకుండా నేనేల కొనసాగగలను
ఊహించుటయే నా వల్ల కాదయ్యా -ఆలోచించుంటే నా గుండె బరువాయగా ||2||
నీ కృప ఉంటే చాలయ్య -నీ దయలేక నేను లేనయ్యా ||2||
1. నా దుఃఖ స్థితిలో ఓదార్చినది -నా ఒంటరి పయనంలో తోడై నిలచినది ||2||
నీ కృపయే నా పక్షమై నిలచి -నాకై పోరాడి విజయమునిచ్చినది||2||
నీ కృప ఉంటే చాలయ్య -నీ దయలేక నేను లేనయ్యా
2. దారి తప్పిపోయినను దరి చేర్చినది -ఏ పాపము నెంచక కౌగలించినది ||2||
ఎట్టి అర్హత చూడలేదు -నాలో యోగ్యత కోరలేదు||2||
నీ కృప ఉంటే చాలయ్య- నీ దయలేక నేను లేనయ్యా
3. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి- కృపయే మార్గమై నడిపించుచున్నది ||2||
దీనుల యెడల కృప చూపు వాడవు- మారని ప్రేమతో ప్రేమించు వాడవు
నీ కృప ఉంటే చాలయ్య- నీ దయలేక నేను లేనయ్యా