Nee Krupa Chaalunu song lyrics:
నీ కృప చాలును
నీ ప్రేమ చాలును
నీవు నాకు తోడుంటే చాలును యేసు ||2||
నీవు లేని జీవితం అంధకార బంధురం ||2||
నీవు నాకు తోడుంటే చాలును యేసు ||2||
శోధనలు ఎన్నియో వేదనలు ఎన్నియో
నన్ను కృంగదీయు సంకటములెన్నియో ||2||
నీ ప్రేమ వర్షం నా స్థితిని మార్చెగా ||2||
నా జీవితాంతము నీలోనే నిలిచెదన్
నా జీవితాంతము నీతోనే నడిచెదన్
నీవు నాకు తోడుంటే చాలును యేసు ||2||
నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన అందుకో దేవా ||2||
నిను పోలి నేను ఈ లోకమందు
నీ సాక్షిగాను నీ మహిమ చాటెదన్ ||2||
నీ దివ్య వాక్యం ఈ జగాన చాటెదన్
నీ ఆత్మ అభిషేకం నాకు నొసగు దేవా ||2||
నా ప్రేమ గీతం – నా దీన ప్రార్ధన
నా హృదయ ఆలాపన అందుకో దేవా ||2||