Nee Chitthamune song lyrics:
నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని
నీ కృపావరమునే దానముగా దయచేసి ||2||
నీ ప్రేమలో పరవశించి
నీ సన్నిధిలో నే చేరి
నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను
దేవా… నా దేవా…
నా యేసయ్యా నా రక్షకుడా ||2|| ||నీ చిత్తమునే||
హృదయము బద్దలై ఏడ్చిన వేళ
కన్నీటి ప్రార్దన చేసిన వేళ ||2||
నీ చిత్తముకై నే ఎదురు చూసి
నీ బలము పొంద సహియింప చేసి
నా ప్రాణమును తృప్తి పరచితివే ||దేవా||
నాలోని ప్రాణం తల్లడిల్లిపోగా
భూదిగంతములనుండి మొర్ర పెట్టుచున్నాను ||2||
నా శత్రువుపై నాకు జయమునిచ్చి
నా ఆశ్రయమై ధైర్యమును నింపి
నా కోట నీవైతివే ||దేవా||