Nee Aananda Thailamutho song lyrics:
నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించుమయ్యా ||2||
తడిసెదను.. నీ జీవనదిలో ||2||
తడిసి తడిసి ఆనందించెదా ||2|| ||నీ ఆనంద||
వీడిపోయెను నా పాప సంకెళ్లు
నన్ను తొలగిపోయెను నా శాపపు కట్లు ||2||
దైవమా.. నీవే ఇచ్చావు రక్షణ ||2||
నే మరువగలనా నీ మంచి ప్రేమ ||2|| ||నీ ఆనంద||
నీ ఆత్మ నాకు తోడుండగా
కానెన్నడు కాను ఒంటరిని ||2||
ప్రేమా ప్రవాహం ఉంచావే నాలోన ||2||
నే మరువగలనా నా హృదయములో ||2|| ||నీ ఆనంద||
నే దాటిపోదును దేశ సరిహద్దులు
ప్రకాశించెద చీకటి లోకంలో ||2||
జీవితం అంకితం చేస్తున్నా యేసయ్యా ||2||
నన్ను వాడుకొనుమా నీ దివ్య సేవలో ||2|| ||నీ ఆనంద||