Naaku nee krupa chaalunu song lyrics:
నాకు నీ కృప చాలును ప్రియుడా ||2||
నాకు నీ కృప చాలును
శ్రమలతో నిండిన ఈ జీవితములో ||2||
నాథా నీ రాక ఆలస్యమైతే ||2||
పడకుండ నిలబెట్టుము నన్ను
జారకుండ కాపాడుము ||2|| ||నాకు||
పాము వలెను వివేకముగను
పావురమువలె నిష్కపటముగను ||2|| ||నాథా||
జంట లేని పావురము వలెను
మూల్గుచుంటిని నిను చేరుటకై ||2|| ||నాథా||
పాపిని నను కరుణించు దేవా
చేరి నిను నే స్తుతియించుచుంటిని ||2|| ||నాథా||