Naakai cheelchabadda song lyrics:
నాకై చీల్చబడ్డ యో
నా యనంత నగమా
నిన్ను దాగి యందున్న
చేను మీర బారెడు
రక్త జలధారలా
శక్తి గ్రోలగా నిమ్ము
నేను నాదు శక్తిచే
నిన్ను గొల్వజాలను
కాల మెల్ల నేడ్చినన్
వేళా క్రతుల్ చేసినన్
నేను చేయు పాపము
నేనే బాప జాలను
వట్టి చేయి చాచుచున్
ముట్టి సిల్వ జేరెదన్
దిక్కు లేని పాపిని
ప్రక్క జేర్చి ప్రోవుము
నా కళంక మెల్లను
యేసునాథ, పాపుము
ఈ ధరిత్రియందున
నీరు దాటునప్పుడు
నాదరించి నీ కడన్
నాకై చీల్చబడ్డయో
నా యనంత శైలమా
నన్ను జేర దీయుమా