Naadu jeevamaayene song lyrics:
నాదు జీవమాయనే నా సమస్తము
నా సర్వస్వమేసుకే నాదు జీవము
నాదు దైవము – దివి దివ్య తేజము ||2|| ||నాదు||
కృంగిన వేళ – భంగపడిన వేళ – నా దరికి చేరెను
చుక్కాని లేని – నావ వలె నేనుండ – అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను – ఆలోచన చెప్పెను ||2|| ||నాదు||
సాతాను బంధీనై – కుములుచున్న వేళ – విడిపించెను శ్రీ యేసుడు
రక్తమంత కార్చి – ప్రాణాన్ని బలిచేసి – విమోచన దయచేసెను
సాతానుని అణగద్రొక్కన్ – అధికారం బలమిచ్చెను ||2|| ||నాదు||
కారు మేఘాలెన్నో – క్రమ్మిన వేళ – నీతిసుర్యుడు నడుపును
తూఫానులెన్నో – చెలరేగి లేచిననూ – నడుపును నా జీవిత నావ
త్వరలో ప్రభు దిగివచ్చును – తరలి పోదును ప్రభునితో ||2|| ||నాదు||