Naa Yedala Neekunna song lyrics:
నా యెడల నీకున్న తలంపులన్ని ||2||
ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్య ||2||
అవి రమ్యమైనవి అమూల్యమైనవి||2||
నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్య
నాకై నీవు తలంచుచున్నావా ||2|| ||నా యెడల||
రాజువైన నీవు దాసుడవయ్యావా
దాసుడనైన నన్ను రాజుగా చేయుటకే ||2||
అభిషేకించావు అధికారం ఇచ్చావు ||2||
పరలోకంలో పరిశుద్ధులతొ సావాసం ఇచ్చావు
నీకే స్తోత్రము యేసయ్య ||2|| ||నా యెడల||
ధనవంతుడవై ఉండి దరిద్రుడవయ్యావా
దరిద్రుడనైన నన్ను ధనవంతునిగా చేయుటకే ||2||
ఐశ్వర్యమిచ్చావు నను ఆశీర్వదించావు ||2||
సుఖశాంతులతో నింపి కాపాడుచున్నావు ||2||
నీకే స్తోత్రము యేసయ్య ||2|| ||నా యెడల||
బలవంతుడవై ఉండి బలహీనుడవయ్యావా
బలహీనుడనైన నన్ను బలవంతునిగా చేయుటకే ||2||
నా స్తానము నిలిచావు నా శిక్ష భరించావు ||2||
నీతిమంతుల సభలో నన్ను నిలబెట్టుచున్నావు
నీకే స్తోత్రము యేసయ్య ||2|| ||నా యెడల||