Naa thalli nanu marachinaa song lyrics:
నా తల్లి నను మరచినా
నా వారే నను విడచినా ||2||
విడువని దేవుడవయ్యా
ఎడబాయని వాడవయ్యా ||2||
యేసయ్యా హల్లెలూయా ||4|| ||నా తల్లి||
స్నేహితులే నన్ను బాధించినా
బంధువులే నన్ను వెలివేసినా ||2||
అన్నదమ్ములే నన్ను నిందించినా
నే నమ్మినవారే గాయపరచినా ||2|| ||విడువని||
లోకమంతా నన్ను ఏడ్పించినా
శత్రువులే నన్ను వేధించినా ||2||
సాతానే నన్ను శోధించినా
సమాజమే నన్ను త్రోసేసినా ||2|| ||విడువని||