Naa pranama sannuthinchuma song lyrics :
నా ప్రాణమా సన్నుతించుమా
యెహోవా నామమును
పరిశుద్ధ నామమును ||2||
అంతరంగ సమస్తమా
సన్నుతించుమా ||2|| ||నా ప్రాణమా||
ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా
దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు ||2||
దీర్ఘ శాంత దేవుడు
నిత్యము కోపించడు ||2|| ||నా ప్రాణమా||
మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు
నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును ||2||
దాక్షిణ్యపూర్ణుడు
నిత్యము తోడుండును ||2|| ||నా ప్రాణమా||