Naa ooha kandani prema song lyrics :
నా ఊహకందని ప్రేమతో నన్ను నీవు పిలిచావు
ఆ ప్రేమలోనే నన్ను నీలోనే నిలిపావు ||2||
నాలోన నీవున్నావు – నీలోన నను దాచావు
నీ సాక్షిగా నను నిలిపావు ||2|| ||నా ఊహకందని||
అందరు నన్ను చూచి నీ బ్రతుకు మారదని
దూరాన నిలచి నన్ను చూచి నవ్వారే ||2||
ఏనాడు అనుకోలేదు
నన్ను నీవు ఎన్నుకుంటావని ||2|| ||నా ఊహకందని||
జీవితమంతా శూన్యమైపోగా
నాకున్న వారే నన్ను విడచిపోగా ||2||
ఏనాడు అనుకోలేదు
నాకు తోడుగా నీవుంటావని ||2|| ||నా ఊహకందని||
నా జీవితాన్ని నీవు మార్చినావు
నీ సేవలోనే నన్ను నిల్పినావు ||2||
ఏనాడు అనుకోలేదు
నా జీవితం ఇలా మారుతుందని ||2|| ||నా ఊహకందని||