Naa naadhudaa song lyrics:
నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు ||2||
అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని ||2||
పెన్నుగ నాలో నాటుమా ||2|| ప్రేమన్ ||నా నాథుడా||
దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ ||2||
యావత్తు పెంటయనుచు ||2|| నిదిగో ||నా నాథుడా||
ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా ||2||
ఆశ కల్గించు నాలోన ||2|| నీవే ||నా నాథుడా||
పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా ||2||
కరుణతో నన్ను గావుమా ||2|| యిప్పుడు ||నా నాథుడా||
భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి ||2||
పాతకుడ నేనైతిని ||2|| మహా ||నా నాథుడా||
ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ ||2||
సదయుడా నన్ను చూడుమా ||2|| యిపుడు ||నా నాథుడా||
హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను ||2||
ఉల్లమందానంద ధ్వని ||2|| యిదియే ||నా నాథుడా||