Naa Maargamandu song lyrics:
నా మార్గమందు నా కంటె ముందు
నడిచావయ్యా నా యేసయ్యా
పరలోకమందు నేనుండాలని
ఒక స్థలమును సిద్ధపరిచావయ్యా ||2||
నిందలు అవమానములెన్నో సహియించి – సహియించి
సిలువలో నా శాపములన్ని భరియించి – భరియించి
అడ్డుగా ఉన్న పాపములన్ని క్షమియించి – క్షమియించి
మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసి…
(నా యేసయ్యా) కృప చేత రక్షించినావు
నన్ను… నీ సాక్షిగా నిలిపినావు ||2||
నీ ప్రేమను – ప్రకటించుటకు
నీ చిత్తము – నెరవేర్చుటకు
నీ సేవలో – కొనసాగుటకు
నీ మహిమలో – నేనుండుటకు
(నా యేసయ్యా) కృప చేత రక్షించినావు
నన్ను… నీ సాక్షిగా నిలిపినావు ||2||
నా యేసయ్యా – నీ సాక్షిగా నిలిపినావు – ||2||
Bible info Telugu website link: