Naa jeevitha Bhagaswaami song lyrics:
నా జీవిత భాగస్వామి – నా ప్రియ యేసు స్వామి
నా జీవిత భాగస్వామి – ప్రియ వరుడా యేసు స్వామి
యేసయ్యా నా స్తుతి పాత్రుడా – యేసయ్యా నా ఘననీయుడా
యేసయ్యా నా మహనీయుడా – యేసయ్యా నా ఆరాధ్యుడా ||2||
అరచేతిలో చెక్కావు – నీ శ్వాసతో నింపావు
జీవాత్మగ నను చేసి సృష్టించావు ||2||
ప్రతిగా నీకేమివ్వగలనేసయ్యా
నా సమస్తముతో ఆరాధింతును ||2|| ||యేసయ్యా||
అమితముగా ప్రేమించి – ప్రాణమునే అర్పించి
నీ వధువుగా నన్ను స్వీకరించావు ||2||
నీ ఋణమెలా తీర్చగలనేసయ్యా
నా జీవితముతో ఆరాధింతును ||2|| ||యేసయ్యా||