Naa jeevam nee krupalo song lyrics:
నా జీవం నీ కృపలో దాచితివే
నా జీవిత కాలమంతా
ప్రభువా నీవే నా ఆశ్రయం
నా ఆశ్రయం ||నా జీవం||
పాపపు ఊబిలో పడి కృంగిన నాకు
నిత్య జీవమిచ్చితివే ||2||
పావురము వలె నీ సన్నిధిలో
జీవింప పిలచితివే ||2|| ||నా జీవం||
ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రము
అడ్డురానే వచ్చెనే ||2||
నీ బాహు బలమే నన్ను దాటించి
శత్రువునే కూల్చెనే ||2|| ||నా జీవం||
కానాను యాత్రలో యొర్దాను అలలచే
కలత చెందితినే ||2||
కాపరివైన నీవు దహించు అగ్నిగా
నా ముందు నడచితివే ||2|| ||నా జీవం||
వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము
నన్ను వెంటాడెనే ||2||
వాక్యమైయున్న నీ సహవాసము
ధైర్యము పుట్టించెనే ||2|| ||నా జీవం||
స్తుతుల మధ్యలో నివసించువాడా
స్తుతికి పాత్రుడా ||2||
స్తుతి యాగముగా నీ సేవలో
ప్రాణార్పణ చేతునే ||2|| ||నా జీవం||