Naa gunde chappudu song lyrics:
నా గుండె చప్పుడు చేస్తుంది నీకే స్తోత్రమని
నా మనసే ఎప్పుడు చెబుతుంది హోసన్నా జయమని ||2||
పదే పదే పాడుతుంది నా నాలుకా ||2||
నీకే నా ఆరాధనా యేసయ్యా
నీకే నా ఆరాధనా ||2||
నేను బ్రతికి ఉన్నానంటే కారణం నీవేగా
నాకున్న ఆధారం ఆశ్రయం నీవేగా ||2||
నా శక్తి చేత కాదు నా బలము చేత కాదు
కేవలం నీ కృపయే ||2||
కేవలం నీ కృపయే ||నా గుండె||
నీతోనే ఉండుటకు నన్నెన్నుకున్నావు
నీ ప్రేమ విందులో నన్ను చేర్చుకున్నావు ||2||
నీ పరిపాలనలోన నా ఆత్మనుంచుట
నాకెంత భాగ్యము ||2||
నాకెంత భాగ్యము ||నా గుండె||