Naa Deva Neeve Sadhaa song lyrics:
నా దేవా నీవే సదా – నా తోడు నీవే కదా
ఇన్నాళ్ళ నీ ప్రేమ – నే మరతునా
వింతైన ఆ ప్రేమ – కొనియాడనా
1.నా దేవ నీ ప్రేమ – ఉదయించె నాలో
నీ పిలుపు నా కోసం – చిగురించె నాలో
ఎనలేని ఆనందం – నీ నామ ధ్యానం
విలువైన నీ వాక్యం – నా ఆత్మ దీపం
మనోహరా యేసయ్య – నా గురి నీవనీ
మరీ మరీ కోరాను – నీ ముఖ కాంతినీ
నిరతము పాడనా – నీ స్తోత్ర గానం
2. సరిలేని నా మార్గం – మలిచావు నీవు
చిరకాల నీ స్నేహం – కురిపించినావు
ఇలలోన ఆధారం – కనిపించె నీలో
కరుణించు నా దైవం – తరియింతు నీలో
మనోహరా యేసయ్య – నా జత నీవనీ
మరీ మరీ కోరాను – నీ ముఖ కాంతినీ
నిరతము పాడనా – నీ స్తోత్ర గానం