Naa deepamu yesayya song lyrics:
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
సుడిగాలిలోనైనా జడి వానలోనైనా
ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
నీవు వెలిగించిన దీపము – ||2||
ఆరని దీపమై దేదీప్యమానమై
నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ||2||
చేసావు పండుగ వెలిగావు నిండుగా ||2|| ||నా దీపము||
మారని నీ కృప నను వీడనన్నది
మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది ||2||
మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా ||2|| ||నా దీపము||
ఆగని హోరులో ఆరిన నేలపై
నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై ||2||
పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా ||2|| ||నా దీపము||