Naa chinni hrudayam song lyrics : Lois Yarlagadda
నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ
నిను చాటనీ – నిను ఘనపరచనీ
నీ రాకకై వేచియుండనీ ||నా చిన్ని||
కావలివారూ వేకువకై చూచునట్లు
నా ప్రాణము నీకై యెదురు చూడనీ ||2||
నా ప్రాణము నీకై యెదురు చూడనీ ||నా చిన్ని||
దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగా
నా ప్రాణము నిన్నే ఆశింపనీ ||2||
నా ప్రాణము నిన్నే ఆశింపనీ ||నా చిన్ని||
పనివారు యజమాని చేతివైపు చూచునట్లు
నా కన్నులు నీపైనే నిలచియుండనీ ||2||
నా కన్నులు నీపైనే నిలచియుండనీ ||నా చిన్ని||