Kshanamaina Gadavadu:
క్షణమైన గడవదు తండ్రి
నీ కృప లేకుండా – ||2||
ఏ ప్రాణం నిలువదు ప్రభువా
నీ దయ లేకుండా – ||2||
నీవే నా ప్రాణం – నీవే నా ధ్యానం
నీవే నా సర్వం – యేసు ||2|| ||క్షణమైన||
ఇంత కాలం లోకంలో బ్రతికా
జీవితం అంతా వ్యర్థం చేసా
తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్థమని
అనుభవించాను నీ సన్నిధిలో ఆనందమని ||2|| ||నీవే||
పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నా
ఎక్కడ ఉన్నా నేనేమై యున్నా
నీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్యా
నీ రెక్కలే నాకు ఆశ్రయం నా యేసయ్యా ||2|| ||నీవే||
జ్ఞానమున్నా పదవులెన్నున్నా
ధనము ఉన్నా సర్వం నాకున్నా
నీవు నాతో లేకుంటే అంతా శూన్యమేగా
పరలోక స్వాస్థ్యం ఎల్లప్పుడు శ్రేష్ఠమేగా ||2|| ||నీవే||