Kshamaapana Dorikenu :
క్షమాపణ దొరికేనా ||2||
చిట్ట చివరి.. అవకాశం నాకు దొరికేనా ||2||
యేసయ్యా… యేసయ్యా…
కక్కిన కూటికై – తిరిగిన కుక్కలా
ఎన్నో మారులు తిరిగితినయ్యా ||2||
అయినా కూడా నీ కృప చూపి
ఆదరించిన అద్వితీయుడా ||2||
ఆదరించిన అద్వితీయుడా ||యేసయ్యా||
అడిగే అర్హత లేకపోయినా
నీ ప్రేమను బట్టి అడుగుతు ఉన్నా ||2||
తల్లి మరచినా మరువని దేవుడా
నన్ను విడువని యేసునాథుడా ||2||
నన్ను విడువని యేసునాథుడా ||యేసయ్యా||