kreesthesu Prabhuvu :
క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి
కొన్నట్టి సంఘమున
ఎవరు చేరెదరో వారే ధన్యులు
పరలోకము వారిది ||2|| ||క్రీస్తేసు||
అపొస్తలుల బోధను నమ్మి
స్థిరపరచబడిన వారే ||2||
ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడు
సంఘములో నిలిచెదరు ||2|| ||క్రీస్తేసు||
పరిశుద్ధులతో సహవాసమును
ఎవరు కలిగియుందురో ||2||
వారే పొందెదరు క్షేమాభివృద్ధి
క్రీస్తేసు ప్రభువు నందు ||2|| ||క్రీస్తేసు||
ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే
తన యందు నిలిచెదరు ||2||
ప్రకటించెదరు ఆయన మరణ
పునరుత్తానమును వారు ||2|| ||క్రీస్తేసు||
పట్టు వదలక సంఘముతో కూడి
ఎవరు ప్రార్ధించెదరో ||2||
ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు
బంధించెదరు వారే ||2|| ||క్రీస్తేసు||
క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు
ఎవరెదురు చూచెదరో ||2||
నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు
సర్వ లోకము నందు ||2|| ||క్రీస్తేసు||