కన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు ||2||
ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? ||2||
1. కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో ||2||
ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో ||2|| ||ఓ యువకుడా||
2. మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? ||2||
వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? ||2|| ||ఓ యువకుడా||
3. విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప ||2||
జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద ||2|| ||ఓ యువకుడా||
4. మందిరము పడియుండ మందుడవై నీవుండి ||2||
సరంబీ గృహములలో సంతోష సమయమిదా? ||2|| ||ఓ యువకుడా||
5. మహిమ ఆర్భాటముతో క్రీస్తు రాజు వేంచేయ ||2||
నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా ||2|| ||ఓ యువకుడా||