Iruvadi Naluguru Peddalatho:
ఇరువది నలుగురు పెద్దలతో
పరిశుద్ధ దూతల సమూహముతో ||2||
నాలుగు జీవుల గానముతో ||2||
స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది||
భూమ్యాకాశములన్నియును
పర్వత సముద్ర జల చరముల్ ||2||
ఆకాశ పక్షులు అనుదినము ||2||
గానము చేయుచు స్తుతియింపన్ ||ఇరువది||
కరుణారసమగు హృదయుడవు
పరిశుద్ధ దేవ తనయుడవు ||2||
మనుజుల రక్షణ కారకుడా ||2||
మహిమ కలిగిన మా ప్రభువా ||ఇరువది||
గుప్పిలి విప్పి కూర్మితోను
గొప్పగ దీవెనలిచ్చెదవు ||2||
గొర్రెల కాపరి దావీదు ||2||
అయ్యెను ఎంతో మహారాజు ||ఇరువది||