Inthavarku Neevu:
ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకు
నేనేమాత్రము నా జీవితం ఏ మాత్రము
ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు
నేనేమాత్రము మేము ఏ మాత్రము
నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే
నే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే ||2|| ||ఇంతవరకు||
ఎన్నుకొంటివే నన్ను ఎందుకని
హెచ్చించితివే నన్ను ఎందుకని ||2||
మందను వెంటాడి తిరుగుచుంటినే ||2||
సింహాసనం ఎక్కించి మైమరచితివే ||2|| ||నే చూచిన||
నా ఆలోచనలన్ని చిన్నవని
నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే ||2||
తాత్కాలిక సహాయము నే అడిగితినే ||2||
యుగయుగాల ప్రణాళికలతో నను నింపితివే ||2|| ||నే చూచిన||