Intha Kaalam:
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా ||2||
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ||2|| ||ఇంత కాలం||
ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా ||2||
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా ||2|| ||ఇంత కాలం||
నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం ||2||
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా ||2|| ||ఇంత కాలం||
దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితులు ||2||
శోధన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా ||2|| ||ఇంత కాలం||