ఇది కోతకు సమయం
పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా ||2||
పైరును చూచెదమా – పంటను కోయుదమా ||2|| ||ఇది కోతకు||
కోతెంతో విస్తారమాయెనే
కోతకు పనివారు కొదువాయెనే ||2||
ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే ||2|| ||ఇది కోతకు||
సంఘమా మౌనము దాల్చకుమా
కోసెడి పనిలోన పాల్గొందుమా ||2||
యజమాని నిధులన్ని మీకే కదా ||2|| ||ఇది కోతకు||
శ్రమలేని ఫలితంబు మీకీయగా
కోసెడి పనిలోన పాల్గొందుమా ||2||
జీవార్ధ ఫలములను భుజియింతమా ||2|| ||ఇది కోతకు||