ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవి
వట్టి నరుడు కాడు – పట్టి చూడ ప్రభుని – ||2|| ||ఎట్టి||
గాలి సంద్రాలను – గద్ధింపగా యేసు ||2||
హద్దు మీరక ఆగి – సద్దుమణిగిపోయే ||2|| ||ఎట్టి||
పక్షవాతపు రోగిని – తక్షణమే లెమ్మనగా ||2||
పరుపెత్తుకొని లేచి – పరుగెత్తికొనిపోయె ||2|| ||ఎట్టి||
పట్టు యేసుని పాదం – తట్టు దేవుని ద్వారం ||2||
కట్టు ఇక నీ పాపం – నెట్టు నిను పరలోకం ||2|| ||ఎట్టి||