Enthentha Bharamaye: Sayaram Gattu
ఎంతెంత భారమాయె ఆ సిలువ
లోక పాపములన్ని నువ్వు గెలువ ||2||
కదిలినావు ఆ కల్వరికి
మరణముని దరి చేర్చుకొని ||2||
యేసయ్యా… నా యేసయ్యా…
అలసిపోతివ నా యేసయ్యా… ||2||
1. కొరడాలు నీ ఒళ్ళు చీల్చేను
పిడి గుద్దులతో కళ్ళు తిరిగెను ||2||
వడి ముళ్ళు తలలోన నాటేను
నీ కళ్ళు రుధిరాన్ని కురిసెను ||2|| ||యేసయ్యా||
2. బరువైన సిలువను మోయలేక
తడబడె నీ అడుగు అదిరిపడి ||2||
వడివడిగా నిన్ను నడువుమని
పడి పడి తన్నిరి ఆ పాపులు ||2|| ||యేసయ్యా||
3. చల్లని నీ దేహమల్లాడెను
ఏ చోటు లేకుండ గాయాలతో ||2||
కాళ్ళు చేతులకు దిగి మేకులు
వ్రేళాడే సిలువకు నీ ప్రాణము ||2|| ||యేసయ్యా||
4. వెలలేనిది తండ్రి నీ త్యాగము
నీ కష్టమంతయు నా పాపము ||2||
మదిలోన కొలువుండు నా రక్షకా
వదిలేది లేదు నిన్ను నా పాలిక ||2|| ||యేసయ్యా||