ఎంతటి వాడను నేను యేసయ్యా
కొంతైనా యోగ్యుడను కానయ్యా ||2||
ఇంతగ నను హెచ్చించుటకు
ఈ స్థితిలో నన్నుంచుటకు ||2|| ||ఎంతటి||
ఐశ్వర్యము గొప్పతనమును
కలిగించు దేవుడవీవే
హెచ్చించువాడవును
బలమిచ్చువాడవు నీవే ||2||
అల్పుడను మంటి పురుగును
నన్ను ప్రేమించినావు
ప్రాణమును నీ సర్వమును
నా కొరకై అర్పించినావు ||ఎంతటి||
నిను వెంబడించువారిని
నిజముగ సేవించువారిని
నీవుండే స్థలములలో
నిలిచే నీ సేవకుని ||2||
ఎంతో ఘనపరచెదవు
ఆశీర్వదించెదవు
శత్రువుల కంటె ఎత్తుగా
అతని తలను పైకెత్తెదవు ||ఎంతటి||
వినయముగల మనుష్యులను
వర్దిల్లజేసెదవు
గర్విష్టుల గర్వమునణచి
గద్దె నుండి దించెదవు ||2||
మాదు ఆశ్రయ దుర్గమా
మేమంతా నీ వారమే
మా శైలము మా కేడెమా
మాకున్నదంతా నీ దానమే ||ఎంతటి||