Entha Prema Yesayya:
ఎంత ప్రేమ యేసయ్యా – ద్రోహినైన నా కొరకు
సిలువలో ఆ యాగము చేసావు – రక్తము కార్చావు
ఎందుకు ఈ త్యాగము – పాపినైన నా కొరకు
సిలువలో ఆ యాగము నొందను – రక్తము చిందను
సురూపమైనా సొగసైనా లేకపోయెను ||2||
యేసు నిలువెల్ల రక్త ధారలు కారిపోయెను ||2||
నలిగిపోయెను – విరిగిపోయెను
1. ఎంత శ్రమను ఎంత బాధను
అనుభవించినాడే విభుడు ||2||
మనకు క్షమాపణ ఇచ్చెను
అభయము కలుగజేసెను
హింసింపబడి దూషింపబడి
హింసింపబడి దూషింపబడెను
కరుణతో నను రక్షింప
నా కోసమే ఈ యాగమా ||ఎంత ప్రేమ||
2. సమస్తము సంపూర్ణమాయెను
జీవముకై మార్గము తెరిచెను ||2||
అపవాదిని అణచివేసి
మరణ ముల్లును విరచి వేసెను
విజయశీలుడై తిరిగి లేచెను
పరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చెను
పునరుత్తానుడు మనకు తోడుగా నిత్యము నిలచే