Entha Paapinainanu song lyrics :
ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనును
అంచు నీ సువార్తను
అంత జాటించుడి
1. హల్లెలూయ హల్లెలూయ
ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనున
టంచు బ్రకటించుడి
2. మెండుగా క్షమాపణన్
పూర్ణ సమాధానము
నెంత పాపి కైన దా
నిచ్చి చేర్చుకొనును ||హల్లెలూయ||
3. తన దివ్య సిల్వచే
దీసి పాప శాపమున్
నను బవిత్రపర్చెను
నాకు హాయి నిచ్చెను ||హల్లెలూయ||
4. ఘోర పాపినైనను
నన్ను జేర్చుకొనును
పూర్ణ శుద్ధి నిచ్చును
స్వర్గమందు జేర్చును ||హల్లెలూయ||