Entha manchi devudavesayya song lyrics : రచయిత:పెర్సి థెరీసా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా ||2|| ||ఎంత||
1. ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా ||2||
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా ||2|| ||ఎంత||
2. నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ ||2||
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువలేదయ్యా ||2|| ||ఎంత||
3. నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా ||2||
నీతో కూడా ఈ లోకం నుండీ
పరలోకం చేరెదనేసయ్యా ||2|| ||ఎంత||