ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన
నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన ||2||
1. సంతోషం ఎక్కడ ఉందనీ
సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ ||2||
జగమంతా వెదికాను జనులందరినడిగాను ||2||
చివరికది నీలోనే కనుగొన్నాను ||2|| ||ఎంత మంచి||
2. ప్రేమనేది ఎక్కడ ఉందనీ
క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ ||2||
బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను ||2||
చివరికది నీలోనే కనుగొన్నాను ||2|| ||ఎంత మంచి||
3. సత్యమనేది ఎక్కడ ఉందనీ
నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ ||2||
ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను ||2||
చివరికది నీలోనే కనుగొన్నాను ||2|| ||ఎంత మంచి||