ఎంత కృపామయుడవు యేసయ్యా
(నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా ||2||
నలిగితివి వేసారితివి ||2||
నాకై ప్రాణము నిచ్చితివి ||2|| ||ఎంత||
బండలాంటిది నాదు మొండి హృదయం
ఎండిపోయిన నాదు పాత జీవితం ||2||
మార్చినావు నీ స్వాస్థ్యముగా ||2||
ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము ||2|| ||ఎంత||
కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ
ఈ లోకము నన్ను విడచిననూ ||2||
మరువలేదు నన్ను విడువలేదు ||2||
ప్రేమతో పిలచిన నాథుడవు ||2|| ||ఎంత||
కరువులు కలతలు కలిగిననూ
లోకమంతా ఎదురై నిలచిననూ ||2||
వీడను ఎన్నడు నీ సన్నిధి ||2||
నీ త్యాగమునే ధ్యానించెదన్ ||2|| ||ఎంత||