ఎనలేని ప్రేమ నాపైన చూపి
నీ వారసునిగ చేసినావు ||2||
నీ ప్రేమ నేను చాటెదన్
నా సర్వం నీవే యేసయ్యా ||2||
నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా
నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా ||2||
నీ కృప చేత రక్షించినావే
నీ ఋణము నే తీర్చగలనా ||2|| ||ఎనలేని||
తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై
ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు ||2||
కన్నీరు తుడచి నన్నాదరించిన
ఆ జాలి నే మరువగలనా ||2|| ||ఎనలేని||