ఏమి ఉన్నా లేకున్నా
ఎవరు నాకు లేకున్నా ||2||
యేసు నందే ఆనందింతును
యేసయ్యనే ఆరాధింతును ||2||
ఆనందింతును ఆరాధింతును ||2||
యేసు నందే ఆనందింతును
యేసయ్యనే ఆరాధింతును ||2||
మందలో గొర్రెలు లేకున్ననూ
శాలలో పశువులు లేకున్ననూ ||2||
ఏమి నాకు లేకున్నా
కష్ట కాలమందైనా ||2|| ||యేసునందే||
ద్రాక్షా చెట్లు ఫలించుకున్ననూ
అంజూరపు చెట్లు పూయకున్ననూ ||2||
ఏమి నాకు లేకున్నా
నష్ట సమయమందైనా ||2|| ||యేసునందే||