ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి
ప్రతి సమయములోను…
ప్రతి పరిస్థితిలోను ఆనందించండి ||2||
యెహోవా చేసిన మేలుల కొరకై
ఎల్లప్పుడును ఆనందించండి ||2||
ఆరాధించండి ||ఎల్లప్పుడును||
పాపంబు తోడ చింతించుచుండ
నరునిగా ఈ భువిలో ఉదయించెగా
మన పాప భారం తన భుజమున మోసి
మనకై తన ప్రాణం అర్పించెగా ||2||
ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసి
ఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే ||ఎల్లప్పుడును||
విశ్వాసమునకు కలిగే పరీక్ష
ఓర్పును కలిగించే ఒక సాధనమై
శోధనకు నిలిచి సహించిన వేళ
జీవ కిరీటమును పొందెదము ||2||
నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండి
సంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి ||ఎల్లప్పుడును||
ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి
మరణము దుఃఖము ఏడ్పును దూరము చేసి
మనతో నివాసమును కలిగి యుండుటకు
త్వరలోనే రారాజుగా రానైయుండె ||2||
శుభప్రదమైన నిరీక్షణతో కాచియుండండి
సిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి ||ఎల్లప్పుడును||