Ee Dinam Kreesthu :
ఈ దినం క్రీస్తు జన్మ దినం
శుభకరం లోక కళ్యాణం
పరమును విడచి ఇలకు చేరిన
మహిమ అవతారం ||2||
ఆడుము పాడుము ప్రభుని నామము
నూతన గీతముతో
రక్షణ పొందుము ఈ సమయము
నూతన హృదయముతో ||2|| ||ఈ దినం||
దేవ దూతలు పలికిన ప్రవచనం
జ్ఞానులకొసగిన దివ్య మార్గం ||2||
ధన్యత కలిగిన దావీదు పురము
కన్య మరియకు ప్రసవ తరుణం ||ఆడుము||
పాప దుఃఖములన్నియు పారద్రోలును
కృపయు క్షేమము కలుగజేయును ||2||
రక్షణ నొసగెడి పరమ సుతునికి
ఇమ్మానుయేలని నామకరణము ||ఈ దినం||