నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించెదము ||2||
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం ||2||
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే ||2||
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||
ఎడారిలో ఉన్న నా జీవితమును
మేలుతో నింపితివే ||2||
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం ||2|| ||ఎబినేజరే||
నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
నీ కృపతో నింపితివే ||2||
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి ||2|| ||ఎబినేజరే||
జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యమాశ్చర్యమే ||2||
నీ పాత్రను కానే కాను
కేవలము నీ కృపయే స్తోత్రం ||2|| ||ఎబినేజరే||
Really Super Song
Really Super Song and Great Voice