Devude ila cheretanduku song lyrics :
దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం
అమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మం
నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం
కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం ||2||
అమ్మా నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో
ఆ దైవము సైతము నేర్చె పాఠాలు చల్లని నీ ఒడిలో ||2|| ||దేవుడే||
కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం
తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం ||2||
మోషేగా మారిన పసివాడిని
దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం ||2||
దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం ||అమ్మా||
సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం
దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను మాతృత్వం ||2||
హన్నా చేసిన ఆ త్యాగమే కాదా
సమూయేలు పొందిన న్యాయాధిపత్యము ||2||
సమూయేలు పొందిన న్యాయాధిపత్యము ||అమ్మా||
కొన ఊపిరితో సిలువపైన వేళాడుతున్న క్షణము
ఆ దేవ దేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి ఋణము ||2||
ప్రియ శిష్యుని దరికి తల్లిని చేర్చి
నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం ||2||
నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం ||అమ్మా||