Christmas Vacchindayyaa:
క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు
రక్షణ తెచ్చిందయ్యా చూడు ||2||
ఆనందం వెల్లి విరిసే
జగతిలో జ్యోతిగా నేడు ||2||
క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణ
యేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా ||క్రిస్మస్||
లోక పాపం తొలగింప
జీవితాలను వెలిగింప ||2||
ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు
విడుదల కలిగించె మనకు ||2|| ||క్రీస్తుకు||
యేసుకు మనలో చోటిస్తే
మానమొక తారగ కనిపిస్తాం ||2||
పరలోక మార్గం క్రీస్తే
సమస్తము ఆయనకు అర్పిద్దాం ||2|| ||క్రీస్తుకు||