Christmas Medly2 :
నర జన్మమెత్తి వరసుతునిగా
అరుదెంచె నేడు సరసముగా
శ్రీ వేల్పుడగు ఆనందమూర్తి
క్రీస్తేసు స్వామి ఈ భువిలోన
మానసవేది పావనమూర్తి
మానవులను పాలించుకర్త
నర జన్మమెత్తి…
లోకముద్ధరింప పరిశుద్ధ జన్మ
మెత్తి కన్య మరియ గర్భవతియాయే ||2|| ||మానసవేది||
బంతి యనగ యాడరే మన
బాల చిన్న ముద్దుల యేసుకు ||2||
ముత్తిక తోడ కూడి యాడి
ముద్దుల పరుడు పల్క పరుడు
గ గ గ రి గ మ మ మ మ
ప మ ప మ ప ద ని స ||2||
ప ద ని స.. ప ద ని స..
ప ద ప ద గ మ గ మ గ రి స రి ||బంతి||
జ్ఞానులెల్ల వచ్చిరి
మంచి కానుకలర్పించిరి ||2|| ||ముత్తిక||
జననము నొందెను జయ యేసు
జయ గీతములు పాడుడి ||2||
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గొర్రెల కాపరులకు దూత
గొప్ప వార్తను తెలిపినట ||2|| ||జననము||
శ్రీ యేసుండు జన్మించే రేయిలో ||2||
నేడు పాయక బేత్లెహేమ యూరిలో ||2||
సత్రమందున పశువుల శాలయందున ||2||
దేవపుత్రుండు మనుజుండాయెనందున ||2|| ||శ్రీ యేసుండు||
చూడబోదాము రారే
సకల జనంబులార
శ్రీ యేసు నాథుని జన్మంబు ||2||
ఆనందముతో మనమందరం ||2|| ఆహ ||చూడబోదాము||
ఘల్లు ఘల్లున మనమెల్లి యేసుని
పాదంబు జంబులకు మ్రొక్కెదము ||2|| ||ఆనందముతో||
ఆహ చూడ… ఆహ చూడ…
ఆహ చూడబోదాము రారే
సకల జనంబులార
శ్రీ యేసు నాథుని జన్మంబు ||2||