Ayya naa kosam kalvarilo song lyrics :
అయ్యా నా కోసం కల్వరిలో
కన్నీరును కార్చితివా ||2||
నశించిపోవు ఈ పాపి కొరకై
సిలువను మోసితివా
అయ్యా వందనమయ్యా
యేసు వందనమయ్యా ||2|| ||అయ్యా||
1. పడిపోయి ఉన్న వేళలో
నా చేయి పట్టి లేపుటకు
గొల్గొతా కొండపై పడిపోయిన
యేసు నా కొరకు తిరిగి లేచితివి ||2|| ||అయ్యా వందనమయ్యా||
2. అనాథ నేను కాదని
సిలువపై నాకు చెప్పుటకు
ఒంటరిగా ఉన్న మరియను
యేసు యోహానును అప్పగించితివి ||2|| ||అయ్యా వందనమయ్యా||